Friday, 1 July 2011

ఓ అందమైన పర్ణశాల




ఆ జంట కనుమల నడుమ
సెలయేటి గలగలలు వినసొంపుగా
మనోనిధి ని ఆహ్లాదపరచగా
ఊహ సామ్రాజ్యాన
ఓ అందమైన పర్ణశాల
ప్రకృతి రమణీయ కాంతి సౌధం లో
అబ్బురపరిచే రీతి లో
ఆనందగీతికలు పారవశ్యాన్ని
మదిలో నింపగా
నేను నిర్మించుకున్న
నా ఊహల సౌధం లో
ఆ వినూత్న పర్ణశాల
దోబూచులాడింది
కర్పూర కాంతి లో
దేదీప్యమైన దీపశిఖ పై
వెలిసిన ఆనంద నిలయం వలె
ఆ తలపుల లోకం లో
a సరికొత్త భావచిత్రాన్ని
ఆవిష్కరించింది
ఆ అందమైన పర్ణశాల
ఊహాజనితమైన
నా భావలోకం లో ఆ వేళ


1 comment:

  1. అద్భుత మా చిత్రం ...మహాద్భుతమీ మనోజనిత అక్షర చిత్రం ...అభినందనలు ...శ్రేయోభిలాషి ....నూతక్కి(Kanakaambaram)

    ReplyDelete