Friday, 1 July 2011

చేవలేని చేతకాని సమరం


చెడుపులు , సిల్లంగులు
చేతబడులు, మంత్రాలు తంత్రాలు 
కాలం మహిమ ఇదేనేమో
కాలం మారినా మారని ఓ తరం
ఓ సంస్కృతీ, ఓ పనికిరాని నమ్మకం
నక్కి నక్కి చూస్తుంది
ఈ లోకాన్ని అవివేకంగా అమాయకంగా
ఎల్ల వేళలా పరిభ్రమిస్తుంది 
కూపస్థ మండూకం లా
తాగడానికి నీళ్ళు పడకపోతే అది తంత్రం
పసిపాప గుక్క పెట్టి ఏడిస్తే
అది మంత్రం
వీధి కుక్క చొంగ కారుస్తూ చస్తే అది చేతబడి
ఒక శాపం అంటారు 
ఒక పాపం అంటారు
అంధకారం అలుముకున్న చీకటి లో
యాధాప్రయత్నం చేస్తారు
నిర్లజ్జ గా మారుమూల పల్లెల్లో
అజ్ఞానం తో చేస్తున్న అనుమానపు హత్యలు
సభ్య సమాజం తలదించుకొనే రీతి లో
చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం
విజ్ఞానం పెరుగుతున్నా
మానవజాతి లో  దిగజారిపోతున్న సభ్యత, సంస్కారం
మార్పే రాదు కొందరిలో
ఈ చేవలేని చేతకాని సమరంలో
(చేతబడి చేస్తుందన్న నెపం తో ఓ వృద్దురాలిని  బతికుండగానే ఘోరంగా అగ్నికి ఆహుతి చేసి కిరాతకంగా ఓ గ్రామప్రజలు హత్య చేసారన్న ఆంధ్రజ్యోతి వార్త పత్రికలో కధనం చదివి)







ఓ అందమైన పర్ణశాల




ఆ జంట కనుమల నడుమ
సెలయేటి గలగలలు వినసొంపుగా
మనోనిధి ని ఆహ్లాదపరచగా
ఊహ సామ్రాజ్యాన
ఓ అందమైన పర్ణశాల
ప్రకృతి రమణీయ కాంతి సౌధం లో
అబ్బురపరిచే రీతి లో
ఆనందగీతికలు పారవశ్యాన్ని
మదిలో నింపగా
నేను నిర్మించుకున్న
నా ఊహల సౌధం లో
ఆ వినూత్న పర్ణశాల
దోబూచులాడింది
కర్పూర కాంతి లో
దేదీప్యమైన దీపశిఖ పై
వెలిసిన ఆనంద నిలయం వలె
ఆ తలపుల లోకం లో
a సరికొత్త భావచిత్రాన్ని
ఆవిష్కరించింది
ఆ అందమైన పర్ణశాల
ఊహాజనితమైన
నా భావలోకం లో ఆ వేళ